- Advertisement -

ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి

- Advertisement -

కాంతార సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయారు రిషబ్ శెట్టి. తొలుత కన్నడలో ఆ తర్వాత దేశంలోని వివిధ భాషల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన ప్రతీ భాషలోనూ రికార్డు వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్దే కాదు ఓటీటీలోనూ సత్తాచాటింది.

ఈ సినిమా తర్వాత రిషన్ శెట్టి నెక్ట్స్ చిత్రాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ హీరీగా కాంతార -2 తెరకెక్కుతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు జై హనుమాన్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు రిషబ్.

ఈ రెండు సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు రిషబ్. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహించనుండగా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -