మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచియమైన సాయి ధరమ్ తేజ్ తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఇటీవల కాలంలో సాయి ధరమ్ తేజ్ తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు.మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి అపజయం రావడంతో, ఈసారి ‘తేజ్.. ఐ లవ్ యూ’అనే లవ్ స్టోరితో అభిమానుల ముందుకు వస్తున్నాడు.సినిమా టైటిల్‌లోనే ఇది ప్రేమ కథ అని తెలుస్తుంది.
ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నారు చిత్ర యూనిట్.రెండు పాటలు మినహ సినిమా పూర్తి అయింది.అయితే జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం శనివారం పేర్కొంది.
