- Advertisement -
వివాదాస్పాదాల దర్శకుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ జీవితం ఆధారంగా బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసినిమాకు ‘శశికళ..లవ్ ఈజ్ డేంజరస్ పొలిటికల్’ అనేది శీర్షిక.త్వరలో మీ ముందుకు రాబోతుందని’ ట్వీట్ చేసిన వర్మ..శశికళ, జయలలిత పక్కపక్కనే కూర్చొని ఉన్న పోస్టర్‌ను షేర్‌చేశాడు. దయలేని పురుషులు, జైళ్లకు మన్నార్‌గుడి గ్యాంగ్‌కు మధ్య రిలేషన్‌షిప్ నేపథ్యంలో సినిమా తీస్తున్నట్లు పోస్టర్ ద్వారా చెప్పాడు వర్మ. అయితే ఈసినిమాకు సంబంధించిన వివరాలు చెప్పని వర్మ వచ్చే ఏడాది విడుదళ కానున్నట్లు వెల్లడించారు.
