Saturday, May 4, 2024
- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎవరూ ఎవరినీ తోక్కేయడం లేదు – సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

సాధారణంగా పెద్ద పెద్ద దర్శకులు సైతం ఇండస్ట్రీ లో టాలెంట్ ని చంపేస్తున్నారు అని వారసత్వ రాజకీయాలు లాగా వారసత్వ సినిమా పరిశ్రమ గా తెలుగు పరిశ్రమ మారిపోతోంది అంటూ ఉంటారు. ఈ తరుణంలో దీని మీద అనేక విశ్లేషణలూ అనేక చర్చలూ సాగుతూ ఉండడం మామూలే.

తన తండ్రి దగ్గుబాటి రామా నాయుడు ఇచ్చిన సంస్థ ని తనది గా చేసుకుని ఇండస్ట్రీ లో పెద్ద తలకాయ గా ఉన్న దగ్గుబాటి సురేష్ బాబు ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలిపారు. తను నేను సినిమా కి సంబంధించి మీడియా సమావేశం లో పాల్గొన్న ఆయన ముఖ్య అతిధి గా సినిమా విశేషాలు పంచుకున్న తరవాత మీడియా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇండస్ట్రీ లో పైకి రానివ్వకపోవడం, అణిచివేయడం లాంటివి అసలు జరగవు అని, ప్రతిభ ఉంటె ఎవరు ఎవరినైనా దాటుకుని ముందుకు వెళ్ళచ్చు అని ఇక్కడ కావాల్సింది ప్రతిభ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ” నిర్మాత రాం మోహన్ గారు ప్రతిభ అనేది మాత్రమే పరిగణ లోకి తీసుకునే వ్యక్తి ఆయన అదే కోవలో నానీ , రాజ్ తరుణ్ లని ఇండస్ట్రీ లోకి తీసుకుని వచ్చారు. తెలుగు పరిశ్రమ కి వారిద్దరూ పెద్ద నటులు గా ఇప్పుడు ఉన్నారు అంటే అది రాం గారి చలవే” అని చెప్పుకొచ్చారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -