- Advertisement -

ఆర్ఆర్ఆర్.. నిప్పు, నీరు కాన్సెప్ట్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..!

- Advertisement -

రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కచ్చితంగా ఆ సినిమా ఒక వండర్ అవుతుంది. బాహుబలి సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా రాజమౌళి మారిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆరంభం సమయంలోనే నీరు.. నిప్పు కాన్సెప్ట్ ను జక్కన్న ప్రమోషన్ పోస్టర్ లో చూపించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ ను నీరుగా.. చరణ్ ను నిప్పుగా చూపిస్తూ పబ్లిసిటీ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ కాన్సెప్ట్ పై తాజాగా రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజమౌళి స్పందిస్తూ… నీరు నిప్పు అనేది పూర్తి విరుద్దమైన ఎలిమెంట్స్. ఈ రెండు కూడా ఒకదాన్ని మరోటి నాశనం చేస్తాయి.

కాని ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఆవిరి ఏర్పడి శక్తిగా మారి ప్రపంచం అనే మోటర్ ను నడుపుతుంది అన్నాడు. పూర్తి విరుద్దమైన వీరిద్దరు కలిసి ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడ్డారు అనేది కథాంశం అయ్యి ఉంటుందని ఈ కాన్సెప్ట్ ను చూస్తే అర్దం అవుతోంది. రాజమౌళి ఏం చేసిన అందులో కొత్త్దనం ఉంటుంది. అలానే భారీ ఫైట్లు.. ఎమోషన్స్.. ఉంటాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి అన్ని భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -