Sunday, May 12, 2024
- Advertisement -

‘టాక్సీవాలా’ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న్ హీరో విజ‌య్ దేవ‌ర‌కండ తాజాగా న‌టించిన సినిమా టాక్సీవాలా.ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సిన ఈ సినిమా వాయిదాల వాయిదాలు ప‌డుతు మొత్త‌నికి ఈ రోజే విడుద‌ల అవుతుంది.విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గ‌త సినిమా నోటా స‌రైన విజ‌యం సాధించ‌లేదు.దీంతో ఈ సినిమాపై అంచ‌నాలుభారీగానే ఉన్నాయి.హార్ర‌ర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం మొత్తం కొత్త టీమ్ ప‌ని చేశారు. ఇక విడుద‌ల‌కు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం అయింది.సినిమా ఎడిటింగ్ అవ‌కుండానే సినిమా విడుద‌ల కావడం చిత్ర యూనిట్‌ను క‌ల‌వ‌ర ప‌రిచింది.అయినప్ప‌టికి సినిమాలోని కంటెంట్ ఉందని న‌మ్ముతున్నారు చిత్ర ద‌ర్శక నిర్మాతలు.ఇక ఈ రోజు విడుద‌ల అయిన ఈ సినిమా ట్విట్ట‌ర్ రివ్యూ ఎలా ఉందో ఓసారి చూద్దాం.

కథ:శివ (విజయ్‌ దేవరకొండ) ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తాడు. అక్కడ కార్ల రిపేరింగ్ షెడ్ పెట్టుకున్న తన స్నేహితుడు(మధు నందన్‌) ని కలిసి ఉద్యోగ ప్రయత్నం చేసి పిజ్జా డెలివరీ బోయ్ గా జాయిన్ అవుతాడు. అయితే ఆ వర్క్ కష్టం కొద్ది రోజులుకే తెలిసివస్తుంది. జాబ్ చూడరా అంటే నాచేత జిమ్నాస్టిక్స్ చేయిస్తార్రా అని ఫ్రెండ్ ని తిట్టిపోస్తాడు. ఈ లోగా సిటీలో క్రేజీగా మారిన క్యాబ్ డ్రైవర్ ప్రొఫిషన్ గురించి తెలుస్తోంది.దాని గురించి ఫ్రెండ్ కూడా పాజిటివ్ గా చెప్తాడు. క్యాబ్ డ్రైవర్స్ నెలకు లక్ష సంపాదించచ్చా ..ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్ వీడు..అంటూ ఆవేశపడిపోతాడు. సాప్ట్ వేర్ వాళ్లకన్నా క్యాబ్ డ్రైవర్సే ఎక్కువ సంపాదిస్తారని, క్యాబ్ లో తిరిగే వాళ్లకన్నా..క్యాబ్ డ్రైవర్సే హ్యాపీగా ఉన్నారు అని మరింతగా చెప్పటంతో ఉత్సాహపడి..టాక్సీవాలాగా మారదామని ఫిక్స్ అయ్యిపోతాడు.

అయితే సొంత క్యాబ్ కొనుక్కోవటానికి డబ్బు లేకపోవటంతో తన వదిన (కళ్యాణి) బంగారం అమ్మి,అన్న దాచుకున్న డబ్బులు కలిపి వచ్చిన లక్షా అరవై తొమ్మిది వేలతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొందామని ఫిక్స్ అవుతాడు. ఆ క్రమంలో సెకండ్ హ్యాండ్ కార్ల బ్రోకర్ చిత్రం శ్రీను ని కలుస్తాడు. అతని దగ్గర ఓ దెయ్యం కారు ఉంటుంది. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. బకరాగా ..శివ కనపడతాడు. వెంటనే అంటగట్టి వదిలించుకుంటాడు. తక్కువ రేటుకు వస్తోంది కదా శివ ..ఆ దెయ్యం కారునికొనుక్కుని తమ కష్టాలు తీర్చే దేవుడులా దణ్ణం పెడతాడు. అక్కడ నుంచి టాక్సీ రైడ్స్ మొదలువుతాయి.

టాక్సీ ఫస్ట్ రైడ్‌లోనే అను (ప్రియాంక జ‌వాల్క‌ర్‌) అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇక జీవితం సాఫీగా వెళ్లిపోతుంది అనుకున్న ఆ టాక్సీలో దెయ్యం ఉందని శివకు రివీల్ అవుతుంది. ఆ కారు కొన్నప్పటి నుంచి ఎప్పుడూ కడగకపోయినా.. అద్దంలా మెరుస్తూనే ఉంటుంది. కారులో ఎఫ్ ఎమ్ స్టేషన్స్ అన్నీ అవే మారుతూంటాయి. డోర్ విండోలు అవే క్లోజ్ అవుతూంటాయి. ఎసి వెయ్యకపోయినా చల్లగా ఉంటుంది.ఈ విషయం స్నేహితుడుకి చెప్తే వాళ్లు నవ్వేసి అవన్నీ రిపేర్లు అని కొట్టి పారేస్తారు. కారులో దెయ్యాలు షికారు అనే టైటిల్ తో సినిమా కూడా తీస్తామని వెటకారం చేస్తారు. కారెక్కితే ఠా..దెయ్యాల ముఠా, కారు..డ్రైవర్..ఓ దెయ్యం, కార్లో దెయ్యం నాకేం భయం, దెయ్యం కారులో హర్రర్ సినిమా అంటూ సినిమా టైటిల్స్ కూడా చెప్తారు. కానీ అతి త్వరలోనే వాళ్లకూ అందులో ఓ దెయ్యం ఉందనే విషయం అనుభవంలోకి వస్తుంది. దాంతో కారును వ‌దిలించుకోవాల‌ని శివ ప్ర‌య‌త్నిస్తాడు. కానీ అది అత‌న్ని విడిచిపెట్ట‌దు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో ఆ కారు ఓ మర్డర్ కూడా చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా భయపడిపోతాడు శివ.ఇలాంటి సిట్యువేషన్ లో శివ ఏం చేసాడు..నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ టాక్సి మ్యాటర్ కు అను (ప్రియాంక జవాల్కర్‌), శిశిర (మాళవిక నాయర్‌)లకు ఉన్న రిలేషన్ ఏంటి..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్న దర్శకుడు రాహుల్‌, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సూపర్‌ నేచురల్‌, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో తయారు చేసుకున్న లైన్‌ కావటంతో లాజిక్‌ల గురించి మాట్లాడుకోవటం అనవసరం. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్‌ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్‌ హాఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కాస్త తగ్గినా మార్చురీ సీన్‌ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్‌ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్‌ సారంగ్‌ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు. ఒక్క ‘మాటే వినుదుగా’ పాట తప్ప మిగతా పాటలేవి గుర్తుండేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు : విజయ్‌ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్‌, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో విజయ్‌ నటన సూపర్బ్‌ అనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్‌ రోల్‌ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్‌ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్‌, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

బోట‌మ్ లైన్: విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌వ‌న్ క‌న్నా గ్రేట్‌.ఆన్‌లైన్‌లో వ‌చ్చిన సినిమాను కూడా సూప‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -