మహాభారతంలో కర్ణుడి పాత్ర ప్రముఖమైంది. కురుక్షేత్ర రణరంగంలో కర్ణుడు ప్రధాన భూమిక పోషించాడు. కర్ణుడి గొప్పతనం తెలుపుతూ ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తారట. విక్రమ్ హీరోగా యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ బ్యానర్‌పై మలయాళంలో ‘యన్ను నిన్టే మోయిదీన్’ ఫేమ్ ఆర్.యస్. విమల్ దర్శకత్వంలో ‘మహావీర్ కర్ణ’ చిత్రం రూపొందించనున్నారు. అయితే హిందీలో ‘మహావీర్ కర్ణ’ అనే టైటిల్‌తో మరో చిత్రం కూడా రూపొందుతోంది.
అయితే ఈ సినిమాను ఇతర భాషల్లోకి కూడా డబ్ చేస్తారంట. ‘‘హిందీలో తెరకెక్కించి మిగతా భాషల్లోకి డబ్ చేయాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న టెక్నీషియన్స్‌ను తీసుకోవాలనుకుంటున్నాం. రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లి, వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది.
