ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేసినా.. హైలైట్ అవుతోంది. మొన్నటికి మొన్న.. ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ.. మీడియాతో పాటు.. మామూలు జనాన్ని కూడా అట్రాక్ట్ చేసింది.
ఇప్పుడు.. పవన్ కు సంబంధించిన ఇంకో వార్త.. పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.
జనసేనను పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ముందుగా యూ ట్యూబ్ చానల్ ను ఏర్పాటు చేయాలని డిసైడయ్యారట. ఇది వర్కవుట్ అయితే.. పార్టీ కార్యక్రమాలను, దేశంలో రాజకీయాలపై తన అభిప్రాయాలను డైరెక్ట్ గా ప్రజలతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది.
ట్విటర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న పవన్.. యూ ట్యూబ్ చానల్ తో మరింతగా జనంలోకి వెళ్లొచ్చని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే… పార్టీని పెట్టినట్టే ధూంధాంగా యూ ట్యూబ్ చానల్ ఓపెన్ చేసి.. చివరికి అప్పుడప్పుడూ జనంలోకి వచ్చినట్టే చానల్ లో కూడా కనిపిస్తే.. పెద్దగా రిజల్ట్ ఉండదని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు.
