Friday, March 29, 2024
- Advertisement -

‘యుద్ధం శరణం’ మూవీ రివ్యూ

- Advertisement -

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్య చేసిన సినిమా యుద్ధం శరణం. కొత్త డైరెక్టర్ కృష్ణ ఆర్వీ మరిముత్తు డైరెక్షన్ లో ఈ సినిమాని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ నెగిటివ్ రోల్ చేసారు. చైతన్య సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీ నటించింది. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా అన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అర్జున్ (నాగ చైతన్య) డ్రోనో మేకర్. అర్జున్ ప్రపంచం కేవలం అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ, ఫ్రెండ్స్. ఇలాంటి సమయంలో అర్జున్ లైఫ్ లోకి.. అంజలి (లావణ్య త్రిపాఠి) వస్తోంది. అర్జున్ తల్లితండ్రుల 30వ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు అర్జున్. అయితే అదే టైంలో.. సిటీలో రెండు ప్లేసుల్లో బాంబ్ బ్లాస్ట్ అవుతోంది. కానీ అర్జున్ తల్లి దండ్రులు మాత్రం లోయలో పడి మరణిస్తారు. ఇక నాయక్ (శ్రీకాంత్) డబ్బు కోసం ఏమైనా చేసే లోకల్ టెర్రరిస్ట్. కానీ తమ తల్లి దండ్రులు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం అర్జున్ ఇంటి సభ్యులు పోలీస్ కేస్ పెడతారు. మరి అర్జున్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారు..? అర్జున్ కుటుంబంకు నాయక్ కి సంబంధం ఏంటి..? మరి నాయక్ ని అర్జున్ ఎలా అంతం చేశాడు..? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘యుద్ధం శరణం’ సినిమాలో నాగచైతన్య మరో యాంగిల్‌ లో కనిపించారు. ప్రేమ కథలకు సరిగ్గా సరిపోయే నాగచైతన్య.. ఆయుధాలు, బాంబులు వాడకుండా ప్రస్తుతం వున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా టెక్నాలజీని వాడుకుంటూ తనకు ఎదురైన సమస్యకు సమాధానమిచ్చాడు. అంటే.. ప్రేమికుడుగా కాకుండా.. కొత్త రకంగా కూడా డిఫరెంట్ గా కూడా నటించగలడు అని నిరుపించుకున్నాడు. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. లుక్స్ పరంగా కూడా బాగున్నాడు. ఫస్ట్ మొత్తం.. లవ్ రొమాంటిక్.. ఎంటర్‌టైనింగ్ తో ఆకట్టుకున్న చైతు.. సెకండ్ హాఫ్‌లో పూర్తిగా ఎమోషనల్ అంశాలతో ఆకట్టుకున్నాడు. ఇక నెగిటివ్ పాత్ర చేసిన శ్రీకాంత్ తన నటనను అద్భుతంగా చూపించాడు. సెటిల్డ్‌గా నెగెటివ్ పాత్రలో శ్రీకాంత్ ఒదిగిపోయాడు. చైతూ, శ్రీకాంత్‌ల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠీ బాగా చేసింది. చైతూ-లావణ్యల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. అలాగే రావు రమేష్, రేవతి, మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా చేసారు. ఇక సినిమా విషయంకు వస్తే.. సంతోషంగా సాగిపోతున్న ఓ కుర్రోడి ఫ్యామిలీ జీవితంలోకి అనుకోని ఓ పెద్ద సమస్య వస్తే.. ఆ సమస్య పోరాడటానికి అతను ఏం చేసాడన్నేదే ఈ సినిమా కథాంశం. డైరెక్టర్ ఈ సినిమా నడిపించిన విధనం చాలా బాగుంది. నికేత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన పాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

కథ కొత్తది ఏమి కాకపోయిన.. డైరెక్టర్ తను అనుకున్నది అనుకున్నట్లు చూపించడంలో సక్సెస్ అయినప్పటికి.. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అక్కడక్కడ కాస్త తడబాటు పడినట్లుగా అనిపిస్తోంది. స్పీడ్ కథనం ఉంటే బాగుండేది. కండ్ హాఫ్‌లో ఎమోషనల్ ఎక్కువై.. వేగం తగ్గినట్లుగా అనిపిస్తోంది. సంగీతం పై ఇంకాస్తా పని చేసి ఉంటే బాగుండేది.

మొత్తంగా :

యుద్ధం శరణం ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్. చైతు సినిమాలను.. ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లింగ్ సినిమాలను చూసే వారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -