- Advertisement -

హైదరాబాద్‌లో ‘పెద్ది’ షెడ్యూల్‌..!

- Advertisement -

ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతున్న అత్యంత ఆసక్తికరమైన తెలుగు చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -