- Advertisement -

శోభనం గదిలో సంచలనం..పెళ్లి కొడుకు పెద్దమనసు

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని హరిపూర్‌లో వైభవంగా జరిగిన ఒక వివాహం అనూహ్య మలుపు తీసుకుంది. పెళ్లి వేడుకలు ముగిసి శోభనం గదికి చేరుకున్న తర్వాత అసలు విషయం బయటపడింది. పెళ్లికూతురు, తనకు ఇప్పటికే వేరే వ్యక్తితో ప్రేమ ఉందని, తల్లిదండ్రుల ఒత్తిడితో ఈ పెళ్లి జరిగిందని వరుడికి వెల్లడించింది.

ఈ విషయాన్ని విన్న పెళ్లికొడుకు క్షణం ఆలోచించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భయంతో, అనుమానాలతో కాపురం చేయలేనని స్పష్టం చేశాడు. తన ప్రాణ భద్రతకూ ప్రమాదం ఉండొచ్చని భావించి, ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి విషయాన్ని వెల్లడించాడు. “నేను మా తల్లికి ఒక్కడే కొడుకును… ఇలాంటి పరిస్థితుల్లో జీవించడం కష్టం” అని చెప్పినట్లు సమాచారం.

దీంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరస్పర అంగీకారంతో పెళ్లిని రద్దు చేసుకుని, ఎవరి ఖర్చులు వారు తీసుకుని వెనుదిరిగారు. భావోద్వేగాల కంటే వాస్తవాలను అర్థం చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -