- Advertisement -
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయిన భార్య కవిత(29)ను హత్య చేశాడు భర్త సిద్ధారెడ్డి. మార్చి 27న ప్రియుడు పవన్ రెడ్డితో వెళ్లిపోయింది కవిత. మార్చి 30న జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త.
అదృశ్యం కేసు నమోదు చేసి.. జడ్చర్లలో ప్రియుడు పవన్ రెడ్డితో కవిత ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కవితను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులతో వెళ్లి.. కారులో సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే కత్తితో భార్య గొంతులో పొడిచి హత్య చేశాడు భర్త సిద్ధారెడ్డి.
తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందింది భార్య కవిత.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
