- Advertisement -

కరీంనగర్‌ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య…

- Advertisement -

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్‌ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, ఎస్ఐ చంద్రశేఖర్ తన అత్తింట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఐదు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరుసగా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని, స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన వెనుక కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.

ఈ దుర్ఘటనలో అత్యంత విషాదకర అంశం ఏమిటంటే… ఈ దంపతులకు చెందిన ఇద్దరు చిన్నారులు ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిపోయారు. చిన్నారుల భవిష్యత్తు పై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వరుస ఆత్మహత్యల వెనుక గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -