ఎన్టీఆర్ జిల్లాలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్న కూతురిపై తండ్రి గత మూడు నెలలుగా అత్యాచారం చేసినట్లు బయటపడింది. ఈ దారుణాన్ని భరించలేకపోయిన బాలిక, తనపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి స్కూల్‌లో టీచర్‌కు వెల్లడించింది. బాలిక చెప్పిన వివరాలు విని షాక్‌కు గురైన ఉపాధ్యాయులు వెంటనే స్పందించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులకు సమాచారం అందించారు.
సంబంధిత అధికారులు కేసును అత్యవసరంగా నమోదు చేసి బాలికను రక్షణలోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను భద్రత మరియు కౌన్సెలింగ్ కోసం ప్రజ్వల్ హోమ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మానసిక సహాయం అందిస్తున్నారు.
