ఏపీలో ధర్మవరంలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తపై, అలాగే అతని స్నేహితుడిపై ఓ వివాహిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తులసి అనే మహిళ తన భర్తకు మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం ఉందని ఆరోపించింది.
తన భర్త, మన్సూరుద్దీన్ ఇద్దరూ బెడ్రూమ్లో సన్నిహితంగా ఉన్న దృశ్యాన్ని స్వయంగా చూశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని ఇద్దరూ తనను బెదిరిస్తున్నారని పోలీసులకు తెలిపింది. గత కొంతకాలంగా తనపై మానసిక వేధింపులు కూడా కొనసాగుతున్నాయని ఆరోపించింది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత వ్యక్తులను విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కుటుంబ వ్యవహారంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు చట్టపరమైన దర్యాప్తుకు దారి తీసింది. నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
