ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మహిళలు మృతి!

- Advertisement -

దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అతి వేగం ప్రమాదానికి మూలం అని తెలిసినా కొంత మంది నిర్లక్ష్యంతో ఈ ప్రమాదాలు సంబవిస్తున్నాయి. అంతే కాదు మద్యం సేవించి కొంత మంది తాగుబోతులు వాహనాలు నడపడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజాగా కడప జిల్లాలోని ముద్దనూరు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.  ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ఆర్టీసీ ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతులు పెద్దదుద్యాల వాసులుగా గుర్తించారు. ముద్దనూరు పీఎస్‌లో ఆర్టీసీ డ్రైవర్ లొంగిపోయాడు. 

- Advertisement -

ప్రమాద స్థలానికి చెరుకున్న పోలీసులు క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...