- Advertisement -
విజయవాడలో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై ఒక యువకుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల సమాచారం ప్రకారం, నడకుదిట్టి వెంకట శ్రీనాథ్ (18) అనే యువకుడు, రెండు వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు 15 ఏళ్ల బాలికలపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బాధితుల్లో ఒకరు రామలింగేశ్వర నగర్లో తన అమ్మమ్మ ఇంటివద్ద నివసిస్తుండగా, మరో బాలిక కూడా అదే ప్రాంతానికి చెందినదిగా పోలీసులు తెలిపారు. ఇద్దరూ మతిస్థిమితం లేని వారు కావడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
ఈ కేసులో నిందితుడిపై POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. పటమట పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
