- Advertisement -

జీలకర్ర–బెల్లం పెట్టాక..ఆగిపోయిన పెళ్లి!

- Advertisement -

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓ వివాహ వేడుకలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కార్యక్రమం జరుగుతున్న సమయంలో వధువు ఒక్కసారిగా పెళ్లి పీటల నుంచి లేచి తన ప్రియుడి పక్కన నిలబడడంతో పెళ్లి ఆగిపోయింది.

స్థానికంగా ఏర్పాటు చేసిన పెళ్లి మండపంలో వధూవరులు సంప్రదాయ పద్ధతిలో వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జీలకర్ర–బెల్లం కార్యక్రమం కూడా పూర్తయ్యింది. తాళి కట్టే సమయానికి ఒక యువకుడు మండపం ముందు వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూసిన వధువు ఆశ్చర్యంతో “వచ్చావా?” అంటూ పెళ్లి పీటల నుంచి లేచి అతని దగ్గరకు వెళ్లింది.

అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వధువు అందరి ముందే “ఇతను మా ఊరి అబ్బాయి… మేమిద్దరం ప్రేమించుకున్నాం” అని చెప్పి అతని పక్కన నిలబడింది. దీంతో పెళ్లి మండపంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

పెళ్లిని చెడగొట్టాడంటూ వధువు ప్రియుడిపై కొందరు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను ఆపేశారు.

అంతేకాక వధువు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని స్పష్టంగా చెప్పడంతో వివాహ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రెండు కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -