ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భార్య భర్తను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. క్రాంతికి ముందే వివాహం కాగా, ఆమె భర్త ఓ నేర కేసులో జైలులో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.
గురువారం రాత్రి ఇంట్లో టీవీ శబ్దం ఎక్కువగా ఉందని అహ్మద్ తగ్గించాలని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన క్రాంతి కత్తితో అహ్మద్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
