- Advertisement -

టీడీపీ ఆఫీస్ వ‌ద్ద గిరిజ‌నుల ధ‌ర్నా

- Advertisement -

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (TDP) కేంద్ర కార్యాలయం సాక్షిగా గిరిజనులు ఆందోళనకు దిగారు. తమ కష్టార్జితం తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సుమారు 200 మంది గిరిజనులు పార్టీ ఆఫీస్ గేటు ఎదుట బైఠాయించారు. ఒక మంత్రి అనుచరుడి వల్ల తాము మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం, కట్టుబడి పాలెం గ్రామానికి చెందిన గిరిజనులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడైన పామర్తి రాజా తమతో వివిధ పనులు చేయించుకున్నారని గిరిజనులు చెబుతున్నారు. సుమారు 200 మంది కూలీలకు సంబంధించి రూ.1.50 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది.

గత కొంతకాలంగా డబ్బుల కోసం పామర్తి రాజా చుట్టూ తిరుగుతున్నా, ఆయన పట్టించుకోవడం లేదని.. పైగా తమను అవమానపరుస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశతో గిరిజనులంతా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో, పార్టీ ఆఫీస్ ప్రధాన గేటు ముందే బైఠాయించి నిరసన చేపట్టారు.

తమకు రావాల్సిన రూ.1.50 కోట్లు ఇచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు.ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తమ బకాయిలు చెల్లించేలా చూడాలని గిరిజన మహిళలు, కూలీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సొంత పార్టీ కార్యాలయం ముందే, అది కూడా ఒక మంత్రి అనుచరుడిపై ఫిర్యాదు చేస్తూ గిరిజనులు ధర్నాకు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మరియు పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా నాయకులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -