ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు . దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు మాజీ సీఎం జగన్. ఇది ప్రజల పక్షాన నిలిచే వారిని ప్రశ్నించకుండా ఉండేందుకు రూపొందించిన ఒక రాజకీయ కుతంత్రం తప్ప మరొకటి కాదు అన్నారు.
మూడుసార్లు ఎంపీగా ఎన్నుకోబడిన మిథున్ రెడ్డిపై అభియోగాలు పూర్తిగా అవాస్తవం… ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అన్నారు.లిక్కర్ స్కాం కేసు అవాస్తవమని, ప్రతిపక్ష నాయకులను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న చర్య మాత్రమేనన్నారు. 2014–19లో తన పాలనలో జరిగిన అక్రమాలను తప్పించుకోవడానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని తప్పుపడుతున్నారు అని మండిపడ్డారు.
బెల్ట్ షాపులు అక్రమ మద్యం దుకాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేలాది బెల్ట్ షాపులను మూసివేసినప్పటికీ, ఇప్పుడు వాటిని తిరిగి తెరిచి అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అన్నారు. మద్యం ధరలు MRP కంటే ఎక్కువగా వసూలు అవుతున్నాయి. డిస్టిలరీల ఆర్డర్ల వ్యవస్థలో మళ్లీ అవినీతి పెరిగిపోయింది అన్నారు జగన్.
