- Advertisement -

టీవీకేకు బీజేపీ నాయకురాలి మద్దతు!

- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్దం నెలకొనగా రాజకీయాలకు అతీతంగా విజయ్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సైతం విజయ్‌కి మద్దతుగా నిలిచారు. విజయ్‌ను ఆమె ఏకంగా “ముఖ్యమంత్రి” అని సంబోధించడం విశేషం.
ఫలితాల సరళిని చూస్తుంటే తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని ఖుష్బూ అభిప్రాయపడ్డారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల (DMK, AIADMK) ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలు విజయ్‌ను ఆశీర్వదించారని ఆమె పేర్కొన్నారు.

ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రి విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు అని ఖుష్బూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీజేపీ నాయకత్వం తమిళనాడులో తన ఉనికిని చాటుకోవాలని చూడగా ప్రజలు తిరస్కరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -