భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తాజాగా పాక్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. దీంతో పాకిస్తాన్ మరియు శ్రీలంకతో జరగాల్సిన త్రైదేశ క్రికెట్ సిరీస్ నుండి తాము తప్పుకుంటున్నామని… ఈ నిర్ణయం పాకిస్తాన్–ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దు దాడుల్లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు దుర్మరణం పాలైన నేపథ్యంలో తీసుకున్నట్లు ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ జట్లు నవంబర్ 17 నుండి 29 వరకు రావల్పిండి మరియు లాహోర్‌లో జరగాల్సిన త్రైదేశ సిరీస్‌లో ఒకదానితో ఒకటి తలపడాల్సి ఉంది. ఈ టోర్నీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏర్పాటు చేసింది. ACB మూడు స్థానిక క్రికెటర్లు మరణించారని అభిమానులకు తెలియజేసింది. వారు పక్తికా ప్రావిన్స్ రాజధాని షరణాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది అని తెలిపారు.
పక్తికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన ధైర్యవంతులైన క్రికెటర్లు ఈ సాయంత్రం పాకిస్తాన్ పాలకుల కిరాతక దాడిలో వీరమరణం పొందినందుకు ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర దుఃఖం వ్యక్తం చేస్తోంది అని తెలిపారు. ఈ విషాదకర ఘటనకు ప్రతిస్పందనగా మరియు బాధితులకు గౌరవ సూచకంగా, ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు రాబోయే నవంబర్ చివర్లో జరగాల్సిన పాకిస్తాన్‌తో కూడిన త్రైదేశ T20I సిరీస్ నుండి తప్పుకోవాలని నిర్ణయించింది ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు.
