Saturday, May 4, 2024
- Advertisement -

నగరిలో రోజా హ్యాట్రిక్ కొట్టేనా?

- Advertisement -

ఏపీలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి నగరి. ఎందుకంటే టీడీపీ, చంద్రబాబును ఘాటు విమర్శలతో దాడి చేయడంలో ముందుంటారు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా. ఇక చివరి వరకు రోజాకు టికెట్ రాదని అసత్య ప్రచారం చేసినా జగన్ ఆమెకే జై కొట్టారు జగన్.

దీంతో నగరి పోరులో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందారు రోజా. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. నగరి నుండి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది రోజా. 2014లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమపై 871 ఓట్ల తేడాతో ,2019లో గాలి భానుప్రకాష్‌రెడ్డిపై 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు.

టీడీపీ నుండి మళ్లీ గాలి భానుప్రకాష్ రెడ్డే బరిలో ఉండగా కాంగ్రెస్ నుండి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ప్రముఖంగా పోరు వైసీపీ – టీడీపీ మధ్యే ఉండనుంది. నగరి నియోజకవర్గంలో పుత్తూరు, నగరి, విజయపురం, వడమాలపేట, నిండ్ర మండలాలు ఉండగా రోజాకు గత ఎన్నికల్లో వడమాలపేట, నిండ్ర మండలాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. జగన్‌ చేపట్టిన సంక్షేమం,మంత్రిగా తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేస్తుండగా వైసీపీలోని అసమ్మతి తనను గెలిపిస్తుందని బానుప్రకాష్ చెప్పుకొస్తున్నారు. మొత్తంగా నగరి ఎన్నికల ఫలితంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -