- Advertisement -

రాయలసీమ ద్రోహి..చంద్రబాబు!

- Advertisement -

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు .. చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందిస్తూ, అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే, చంద్రబాబు కావాలని ఆ పనులను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు మళ్లీ సీఎంగా ఉంటే రాయలసీమకే కాకుండా కృష్ణా జలాల విషయంలో కూడా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదే విషయంపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని మరోసారి తేటతెల్లమైందని అన్నారు. వైఎస్ జగన్ గారు ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబుతో తానే చెప్పి ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అత్యంత కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో రాయలసీమకు చంద్రబాబు చేసిన అన్యాయం స్పష్టమైందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగిన తీర్పు ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -