- Advertisement -

ఇకపై ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు!

- Advertisement -

ఇకపై ఏపీలో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ… పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారాయి. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలకు శాసనసభలో ఆమోదం లభించింది.

దీంతో త్వరలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. సంతానం ఎక్కువ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని భయాలు వద్దని, చట్టంలో సవరణ చేస్తామని చంద్రబాబు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలను దక్షిణాది రాష్ట్రాలు, ప్రభుత్వాలు పాటించడం ద్వారా కుటుంబ నియంత్ర పాటించి జనాభా సమస్య అధికం కాకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం కుటుంబ నియంత్రణ చర్యలను అక్కడి ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయకపోవడంతో వారి జనాభా విపరీతంగా పెరిగిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -