విజయవాడలో వరద బాధితులపై అధికారులు ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు. తాజాగా సాయం గురించి అడిగినందుకు అజిత్ సింగ్ నగర్ షాదీఖానా రోడ్డులో బాధితులపై ఆగ్రహంతో ఊగిపోయారు వీఆర్వో విజయలక్ష్మి. పోలీసుల సమక్షంలోనే ఓ బాధితుడిని చెంప దెబ్బ కొట్టి.. ఎవరెవరు ప్రశ్నిస్తున్నారో వారిని మొబైల్‌లో వీడియో తీసి మీ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితులతో అధికారులు ఇలాగేనా వ్యవహరించేది అని స్థానికులు మండిపడుతున్నారు.
స్దానికులు ఆమెను చుట్టుముట్టగా పోలీసుల సాయంతో అక్కడి నుండి జారుకున్నారు. వరద బాధితులు తమ ఇబ్బందుల దృష్ట్యా ఏదైనా మాట్లాడినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు చెప్పినా అధికారులు వినకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. వీఆర్వో జయలక్ష్మిని విధుల నుంచి తప్పించడంతో పాటు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.
