- Advertisement -

పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం!

- Advertisement -

NREGS పట్ల కూటమి వైఖరి ఏంటో చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి. జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో NREGS నిధులతో ఆర్బీకేలు, సచివాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్‌ బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం అన్నారు.

ప్రతి గ్రామంలోనూ కోటిన్నర విలువైన సంపద సృష్టించి, ప్రజలకు అందుబాటులో పెట్టాం. గ్రామాల బలోపేతం కోసం మా ప్రభుత్వం కృషి చేసింది. నేడు NREGS నిధులను తెలుగుదేశం నేతలు పందికొక్కుల్లా దోచుకోవడానికే దొడ్డిదారిన మళ్లిస్తున్నారు అన్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థ గొంతుకోస్తోంది కూటమి ప్రభుత్వం. గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి అర్హతలేని వాళ్లను, టీడీపీ మందిమాగాదులకు ఆ పోస్టులు కట్టబెట్టారు అన్నారు.

పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…ఆగస్ట్ 15ని ఘనంగా జరిపామని, ప్రతి పంచాయితీకి రూ. 10,000 ఇస్తామని చెప్పారు. ఇంతవరకూ ఒక్క పంచాయితీకి రూ.10కూడా ఇవ్వలేదు. కేంద్రం అందరికీ ఇచ్చినట్టే ఏపీకి ఇచ్చిన అప్పులపై గొప్పలు చెప్పుకుంటోంది కూటమి ప్రభుత్వం. 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చారు? NREGS పనులను సర్పంచ్‌లకు, గ్రామ సభలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు రికమెండ్ చేసినవారికిస్తూ నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు.స్థానిక సంస్థల పట్ల కూటమికి చిత్తశుద్ధి లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -