Saturday, May 4, 2024
- Advertisement -

ఈటలకు షాకిచ్చిన బీజేపీ

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు షాకిచ్చింది బీజేపీ. తనతో పాటు పార్టీలో చేరిన కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్మన్ తుల ఉమను చివరి నిమిషంలో పోటీ నుండి తప్పించింది బీజేపీ. మాజీ గవర్నర్,బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్‌తో పాటు బీ ఫామ్ ఇచ్చింది. దీంతో ఈటలకు షాక్ తగిలింది.

వాస్తవానికి ఈటలకు రైట్ హ్యాండ్‌గా ఉన్నారు తుల ఉమ. ఆమెకు వేములవాడ స్థానాన్ని ఇప్పించుకోవడంలో తొలుత సక్సెస్ అయ్యారు. అయితే ఉమకు టికెట్ ఇచ్చిన సీనియర్ నేత విద్యాసాగర్‌ రావుకు హ్యాండ్ ఇవ్వడంపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజేసింది. అయితే ఈటల మాత్రం తన వర్గానికి చెందిన నాయకురాలికి సీటు ఇప్పించుకుని బీజేపీ తనకు ప్రాధాన్యత ఇస్తుందని అందరికి చెప్పుకొచ్చారు. కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. నామినేషన్ల పర్వం చివరి రోజు ఉమకు బీ ఫామ్ ఇవ్వకుండ వికాస్‌రావుకు ఇచ్చింది. దీంతో ఈటల వర్గానికి షాక్ తగిలినట్లైంది.

ఇక ఇప్పటికే బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఈటల. ఓ దశలో ఈటల పార్టీ మారడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే దానిని ఎప్పటికప్పుడు కండిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ ఇచ్చిన షాక్‌తో ఆయన పార్టీ మారే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నారు ఈటల. రెండు స్థానాల్లోనూ ఆయన గట్టెక్కడం కష్టాంగనే ఉంది. మొత్తానికి ఈటెల రాజేందర్ ను కాషాయ పార్టీ నిండా ముంచిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆయన సన్నిహితులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -