- Advertisement -

టీడీపీలో బ్రోకర్లదే రాజ్యం..మాజీ ఎమ్మెల్యే ఫైర్

- Advertisement -

టీడీపీలో టికెట్ల చిచ్చు చల్లారడం లేదు.సీనియర్ నేతలకు సైతం చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో వారంతా మండిపడుతున్నారు.ఇప్పటికే పలు జిల్లాల్లో అసంతృప్తి రాజుకుంటుండగా తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నేతల మధ్య పోరు బయటపడింది. తాజాగా టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.

ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని, టీడీపీలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రానందుకు బాధ లేదని, కానీ చంద్రబాబు అనుసరించిన విధానం నన్ను కలిసి వేసిందన్నారు. కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు బొల్లినేని.

చంద్రబాబును అపాయింట్‌మెంట్‌ అడిగినా ఇవ్వలేదని…అది తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా పోటీలో ఉంటానని…టీడీపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా బ్రోకర్లు టిక్కెట్లు ఇప్పిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉదయగిరి టీడీపీ టికెట్ ను ఎన్ఆర్ఐ కాకర్ల సురేశ్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొల్లినేని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -