- Advertisement -

జగన్ హయాంలో అప్పుల‌పై మ‌రోసారి స్ప‌ష్ట‌త‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సాక్షిగా రాష్ట్ర అప్పులపై మరోసారి స్పష్టత ఇవ్వబడింది. మంత్రి పయ్యావుల మండలిలో అధికారిక గణాంకాలను వెల్లడిస్తూ, @ysjagan హయాంలో బడ్జెట్ ద్వారా తీసుకున్న అప్పులు రూ.2,34,225 కోట్లే అని తెలిపారు. అలాగే గత పదేళ్లలో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు రూ.1,40,479 కోట్లుగా నమోదు అయ్యాయని ప్రకటించారు.

ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ జరిగిన ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన మండలిలో పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం అప్పులు రూ.4,91,734 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఇందులో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు కూడా కలిపి ఉన్నాయని స్పష్టం చేశారు.

అయితే 2024 తర్వాత కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలను ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. పూర్తి పారదర్శకత కోసం తాజా గణాంకాలను కూడా వెల్లడించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన కోసం సమగ్ర సమాచారం అవసరమని మండలిలో చర్చ జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -