Monday, May 6, 2024
- Advertisement -

బీజేపీ లిస్ట్..చంద్రబాబుకు చుక్కలు!

- Advertisement -

ఏపీ ఎన్నికలేమో కానీ చంద్రబాబుకు రోజుకో సినిమా కనిపిస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు – సీట్ల సంఖ్య ఖరారులో పవన్‌ని ఒప్పించడానికి తెగ కష్టపడాల్సి వచ్చింది చంద్రబాబు. అదే సమయంలో జనసేనతో పొత్తులో సీట్లు కొల్పోయిన నేతలను దారికి తెచ్చుకోవడానికి నానా యాతన పడ్డారు బాబు.

ఇప్పుడు తాజాగా బీజేపీ చేరింది. అయితే బీజేపీతో పొత్తు కోసం బాబు ఆరాటపడటం వరకు ఒకే. అయితే బాబుతో అలయెన్స్‌కు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాషాయ పార్టీ నుండి సీటు ఆశీస్తున్న నేతలంతా యాక్టివ్ అయ్యారు. టీడీపీ అధినేత ముందుకు లిస్ట్‌ను పంపారు బీజేపీ నేతలు.

దాదాపు 20 ఎమ్మెల్యే, 6-8 ఎంపీ స్థానాలను అడుగుతుండటంతో చంద్రబాబు షాక్‌ తిన్నారని తెలుస్తోంది. అంతర్గతంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఈ సంఖ్యను బాబు ముందు ఉంచినట్లుగా తెలుస్తోండగా ఏం చెప్పాలో తెలియక పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని చంద్రబాబు దాట వేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా బీజేపీ ఆశీస్తున్న ఎంపీ సీట్లలో విశాఖ, అరకు, ఏలూరు, రాజమండ్రి, విజయవాడతోపాటు రాయలసీమలో ఓ ఎంపీ స్థానాన్ని అడుగుతోంది.

ఇందులో విశాఖ, విజయవాడ సీట్లకు టీడీపీలో గట్టి పోటీనెలకొంది. విశాఖ నుండి బాలయ్య చిన్న అల్లుడు బరిలోకి దిగనుండగా విజయవాడ సీటు కోసం పెద్ద రచ్చే నడుస్తోంది. ఇక మిగితా సీట్లలో కూడా పోటీ ఎక్కువగా ఉండటంతో కాషాయ నేతలను చంద్రబాబు ఏ విధంగా ఒప్పిస్తారోననే చర్చ మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -