Saturday, May 4, 2024
- Advertisement -

బాబు రూ.931 కోట్లు..జనసేన మాధవి రూ.894 కోట్లు

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఇక నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు వెల్లడిస్తున్న ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్‌ సమర్పించగా బాబు తన ఆస్తులు రూ.931 కోట్లు అని వెల్లడించారు.

తన వద్ద అంబాసిడర్ కారు ఉందని తెలిపారు. ఏపీకి 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన బాబు ఎనమిదోసారి కుప్పం నుండి బరిలో ఉన్నారు. 1989 నుండి కుప్పంలో చంద్రబాబు గెలుస్తూ వస్తుండగా గత ఎన్నికల్లో 35 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఈసారి గెలుపుకోసం చంద్రబాబు కష్టపడాల్సి వస్తోంది.

ఇక జనసేన నుండి ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న లోకం మాధవి తన ఆస్తులు రూ.894 కోట్లు అని వెల్లడించారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, నగదు, బ్యాంక్ డిపాజిట్లు రూపంలో సైతం ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. చరాస్తులు రూపంలో రూ.856.57 కోట్లు ఉండగా, స్థిరాస్తుల రూపంలో రూ.15.70 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇక నామినేషన్ల పర్వం పూర్తిగా కంప్లీట్ అయితే ఏ నేత ఆస్తులు ఎన్నో అన్నది తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -