సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా ఇది ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేనని తెలిసి ఆ నెపాన్ని జగన్ మీదకు నెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంత పాడటం..సరిపోయింది.
వెరసీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే చేసిన అప్పు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలో జీతాలు, పెన్షన్లు ఇచ్చి డప్పు కొట్టుకోగా ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది.
సంపద సృష్టిస్తా ప్రజలకు పంచుతా అని చెప్పిన చంద్రబాబే ఏడాదిలోపే వేలకోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బంతా ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఈ ఏడు నెలల్లో రూ.80,827 కోట్లు అప్పు చేశారు. ప్రతివారం అప్పు చేస్తే గాని నడవని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు మొదలుకాకుండానే లక్ష కోట్ల అప్పు చేశారంటే చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు అప్పులు మరోవైపు ప్రజలపై ఛార్జీల రూపంలో బాదుడే బాదుడు. ఇంత జరుగుతున్న పైకి మాత్రం కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు.
ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీసుకొచ్చిన రైల్వే ప్రాజెక్టులు సున్నా. 21 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. కేవలం అప్పులతో కాలం వెల్లదీస్తున్న తీరుని ప్రజలు ఎండగడుతున్న పరిస్థితి నెలకొంది.
