సైబర్ క్రైమ్ పోలీసులను మరోసారి ఆశ్రయించారు మెగాస్టార్ చిరంజీవి. AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించి.. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు చిరంజీవి.
అయితే మరోసారి తనపై సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు చిరు. ఈ మేరకు ఓ ఎక్స్ ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసినా ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు చిరంజీవి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని స్పష్టం చేసింది సిటీ సివిల్ కోర్టు. కోర్టు ఆదేశాలతో కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సైబర్ క్రెమ్ పోలీసులు.
