- Advertisement -

అమ్మకానికి సీఎం కేసీఆర్ గుడి!

- Advertisement -

అవును మీరు వింటుంది నిజమే…సీఎం కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టారు మంచిర్యాల జిల్లాకు చెందిన గుండా రవీందర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన రవీందర్…సీఎం కేసీఆర్‌పై అభిమానంతో 2016లో తన ఇంటి ముందు సీఎం కేసీఆర్‌ గుడిని నిర్మించారు. ఇందుకోసం అప్పట్లోనే రూ. 2 లక్షలు ఖర్చు చేశారు. ఇక విశేషం ఏంటంటే అప్పటినుండి కేసీఆర్ విగ్రహానికి పూజలు కూడా చేస్తున్నారు.

కానీ ఇప్పుడు అదే గుడిని అమ్మకానికి పెట్టారు రవీందర్. దీనికి కారణం స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుల తీరేనని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు తనను విస్మరించారని..తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న ఒరిగిందేమీ లేదని అందుకే గుడిని అమ్మకానికి పెట్టాలని చెప్పారు.

ఇక ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ కె.కవితతోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులను, మంచిర్యాల జిల్లా నేతలను ఆహ్వానించానని కాని వారెవరూ రాలేదని చెప్పారు రవీందర్. ఉద్యమ సమయంలో తనకు కేసీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేదని అదే సాన్నిహిత్యంతో ఆయన్ని కలిసేందుకు ఎన్నో సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకే తీవ్ర నిరాశతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించగా ఇప్పుడు ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -