Saturday, April 20, 2024
- Advertisement -

తెలంగాణ‌లో క‌రోనా పంజా.. రేవంత్ రెడ్డికి పాజిటివ్ !

- Advertisement -

తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో కొత్త‌గా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ క్ర‌మంగా అధిక‌మ‌వుతూనే ఉంది. ఇప్ప‌టివ‌కే ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ నేత‌, పార్ల‌మెంట్ స‌భ్యులు రేవంత్ రెడ్డి సైతం క‌రోనా బారిన‌ప‌డ్డారు.

తాజాగా రేవంత్ రెడ్డి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని రేవంత్ స్వ‌యంగా వెల్ల‌డించారు. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ గా వ‌చ్చింద‌నీ, వైద్యుల స‌ల‌హా మేర‌కు తాను హోం ఐసోలేష‌న్ లో ఉండి చిత‌కిత్స పొందుతున్నాన‌ని వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌నీ, త‌గిన జాగ్ర‌త్త‌లు సైతం తీసుకోవాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు.

కాగా, ఇటీవ‌లే ప్రారంభ‌మైన విద్యాసంస్థ‌ల్లో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ నేప‌థ్యంలోనే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 21 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఆ కాలేజీలో విద్యార్థులు, సిబ్బందితో కలిపి 146 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… 21 మందికి పాజిటివ్ గా అని నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థ‌లు త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం సైతం క‌రోనా క‌ట్ట‌డికి త‌గిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

మెగాస్టార్ దూకుడు.. సోనాక్షితో రోమాన్స్ !

ఏపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

రెండు డోసులు తీసుకున్న న‌ర్సుకు క‌రోనా

ఏపీకి ప్రత్యేక హోద ఇవ్వ‌లేం: కేంద్రం

నిమ్మరసం, పసుపు కలిపి తాగితే.. లాభాలేంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -