Monday, May 6, 2024
- Advertisement -

షర్మిల ఓంటరేనా?

- Advertisement -

అన్న జగన్‌తో విభేదాలతో తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టింది షర్మిల. వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టి కాలుకు బల్పం కుట్టుకుని తిరిగారు. నిరుద్యోగ దీక్షలు చేశారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కానీ ప్రజల్లో షర్మిలకు వచ్చిన మద్దతు శూన్యం. దీంతో పాదయాత్రకు బ్రేక్ చేసి ఎవరూ ఊహించని విధంగా తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మధ్యవర్తిత్వంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యారు. దీంతో షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమని అంతా అనుకున్నారు. ఏపీ ఇంఛార్జీగా లేదా కర్ణాటక నుండి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది.

హైదరాబాద్ వేదికగా జరిగిన సీడ్యబ్లూసీ సమావేశాల్లో షర్మిల పార్టీ విలీనం కన్ఫామ్ అనుకున్నారు కానీ అంతా తలకిందులైంది. కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేసేందుకు షర్మిల శతవిధాల ప్రయత్నించిన సాధ్యపడలేదు. దీంతో కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది.

షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం కాకుండా చివరివరకు అడ్డుకుని సక్సెస్ అయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీ.హనుమంతరావు, రేణుకా చౌదరి. షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకుంటే ఏపీలో ఆమె సేవలు ఉపయోగించుకోవాలనే వాదనను తెరపైకి తెచ్చారు. లేదంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని అధిష్టానానికి సూచించారు. దీంతో రాష్ట్ర నేతల ఒత్తిడికి తలొగ్గి షర్మిలకు బ్రేకులు వేసింది అధిష్టానం.

ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడింది షర్మిల. ముందుగా తాను అనుకున్న ప్రకారం పాలేరు నుండి బరిలోకి దిగాలా లేదా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు వేచిఉండాలా అనే మీమాంసలో పడిందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -