Saturday, May 18, 2024
- Advertisement -

ఫ్యాన్‌దే జోరు..రెండోసారి అధికారం జగన్‌దే

- Advertisement -

ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం వీయడం ఖాయమని సర్వేలన్ని తేల్చి చెబుతున్నారు. పారదర్శకమైన పాలన, ప్రభుత్వ పథకాలకు నేరుగా లబ్దిదారులకు అందుతుండటం,మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ ప్రజలు తమ అభిమాన నేతను విశ్వసిస్తుండటంతో ఈసారి కూడా గెలుపు వైఎస్‌ఆర్‌సీపీదేనని తేలింది. ఇప్పటివరకు పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో అప్‌కీ బార్ జగన్ సర్కార్ రావడం ఖాయమని తేలగా తాజాగా పొలిటికల్ క్రిటిక్ నిర్వహించిన సర్వేలో అదే విషయం తేటతెల్లమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో వైసీపీ ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో రావడం ఖాయమని స్పష్టం చేసింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 115 సీట్లను వైసీపీ కైవసం చేసుకోనుండగా టీడీపీ, జనసేన కూటమి 60 స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది.

ఇక బీజేపీ, కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశం లేదని తెలపగా ఓటింగ్ పరంగా చూస్తే వైసీపీ 48 శాతం, టీడీపీ కూటమి 44 శాతం బిజెపి 1.5, కాంగ్రెస్ 1.5 శాతం ఓట్లను సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక అన్ని నియెజకవర్గాల్లో వైసీపీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని అదే జగన్ సర్కార్‌ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేసిందని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -