- Advertisement -

డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు గుడ్‌న్యూస్

- Advertisement -

దేశంలో ప్రస్తుతం పది కోట్ల మందికిపైగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధిని నియంత్రించేందుకు లక్షలాది మంది ప్రతి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడుతున్నారు. ఒక్క రోజు కూడా ఇన్సులిన్ మిస్ అయితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయితే, రోజూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి రావడం వల్ల నొప్పి, భయం, అసౌకర్యం వంటి ఇబ్బందులను చాలామంది మధుమేహ రోగులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యలకు పరిష్కారంగా దేశంలోని అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలలో ఒకటైన సిప్లా లిమిటెడ్ కీలక ఆవిష్కరణను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా పీల్చుకునే ఇన్సులిన్ పౌడర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘అఫ్రెజా’ పేరుతో ఈ ఇన్సులిన్ పౌడర్‌ను విక్రయించేందుకు గత ఏడాది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి అనుమతి పొందిన సిప్లా, తాజాగా దేశీయంగా అందుబాటులోకి తెచ్చింది. ఇది మధుమేహ రోగులకు పెద్ద ఊరటగా మారనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పీల్చుకునే ఈ ఇన్సులిన్ పౌడర్‌ను సిప్లా సింగిల్ డోస్ క్యాట్రిడ్జ్ రూపంలో అందిస్తోంది. ఇన్‌హేలర్‌ను పోలిన ప్రత్యేక పరికరంలో క్యాట్రిడ్జ్‌ను అమర్చి నోటి ద్వారా పీల్చుకోవాలి. వాడిన తర్వాత క్యాట్రిడ్జ్‌ను తొలగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం అనంతరం ఈ ఇన్సులిన్ పౌడర్‌ను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఈ సందర్భంగా సిప్లా లిమిటెడ్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అచిన్ గుప్తా మాట్లాడుతూ, ప్రతి రోగికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. భారతదేశంలో అఫ్రెజాను ప్రవేశపెట్టడం తమ బాధ్యతకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ ఆవిష్కరణతో ఇన్సులిన్ వినియోగం మరింత సౌకర్యవంతమై, రోజువారీ ఇంజెక్షన్ల వల్ల ఎదురయ్యే అనేక సమస్యలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -