Sunday, May 5, 2024
- Advertisement -

175/175..జగన్ ధీమాకు కారణం అదేనా?

- Advertisement -

ఏపీలో రెండోసారి కూడా గెలుపు వైఎస్‌ఆర్‌సీపీదేనని ధీమాలో ఉన్నారు సీఎం జగన్‌. వైనాట్ 175 అంటూ కొద్ది రోజులుగా వైసీపీ నేతలు చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ గ్రాఫ్ మరింత పెరిగిందని అదే సమయంలో టీడీపీ గ్రాఫ్ పడిపోయిందని సర్వేలే వెల్లడించిన క్రమంలో మళ్లీ తెరపైకి 175 సీట్ల నినాదం తెరపైకి వచ్చింది.

2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే అజెండాగా పాలన సాగుతోందని అందుకే వచ్చే ఎన్నికల్లో 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు జగన్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ నిర్వహించిన సర్వేలో ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో సమావేశంలో జగన్‌ కీలక సూచనలు చేయడమే కాదు కొంతమంది సిట్టింగ్‌ల మార్పు నిర్ణయానికి వచ్చారట. మళ్లీ వచ్చేది మనమేనని అందుకే సీటు రాని వాళ్లు అధైర్య పడొద్దని సూచించారట.

జగన్ చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం కావడం, గతేడాది కాలంగా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు నేరుగా ప్రజల్లో తిరుగుతున్నా ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదని నేతలతో సూచించారట. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీని ఓడించడం ప్రతిపక్షాలకు అసాధ్యం అని.. స్కాములు లేకుండా స్కీములు అందజేయడమే ఇందుకు కారణమట. అందుకే ఈ జోష్ ఏ మాత్రం తగ్గకుండా మరో రెండు నెలలు కూడా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనన్నే కావాలి అనే కార్యక్రమాల కింద వార్డు మెంబర్ల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు ఉండనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం అయ్యాక వై నాట్ 175ని మరింత ప్రచారం చేసి టీడీపీ – జనసేన కూటమిని దెబ్బతీయాలని చూస్తున్నారట. దీనికి తోడు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి, లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితం అయ్యే పరిస్థితి. అందుకే రానున్న రోజుల్లో వైసీపీ శ్రేణుల్లో నిత్యం జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -