- Advertisement -

ఏపీ పోలీస్‌ వ్యవస్థపై జగన్‌ తీవ్ర ఆరోపణలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు యంత్రాంగం పనితీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు యంత్రాంగాన్ని పావుగా వాడుకుంటున్నారని జగన్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని అణచివేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అసమ్మతి గొంతులను నొక్కేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకుంటున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ ఆరోపించారు.

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వైసీపీకి మద్దతుగా నిలిచే వారిని టార్గెట్ చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వైసీపీ శ్రేణులపై విషం చిమ్ముతున్నారు. అక్రమంగా అరెస్టులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. వైసీపీ ప్రతినిధులు ఇచ్చే ఫిర్యాదులను పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు. చట్టం అందరికీ సమానంగా వర్తించడం లేదు అన్నారు జగన్. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీకి తొత్తులుగా మారకూడదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -