జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన పోస్ట్ చేశారు. హోం మంత్రి అనిత నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పై బొలిశెట్టి వీడియో పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
పాయకరావుపేట నియోజకవర్గం దుర్గానగర్ లో అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయని… జిల్లా అధికారులు, సీఎస్, సీఎంకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బొలిశెట్టి వెల్లడించారు.
సారాసరి హోంమంత్రే ఒక నెల క్రితం ఇక బ్లాస్టింగులు జరగవు అని హామీ ఇచ్చినప్పటికీ, బ్లాస్టింగ్ ఇంకా నివాసాల మరియు పాఠశాలల సమీపంలో ప్రమాదకరంగా కొనసాగుతోంది. రెండు రోజుల పోలీసు అధికారులు ఇక బ్లాస్టింగులు జరగవు హామీ ఇచ్చినా బ్లాస్టింగ్ కార్యకలాపాలు ఆగలేదు అని ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇటీవల నివాస ప్రాంతాలకు బ్లాస్టింగ్ మధ్య దూరన్ని 500 మీటర్లకు పెంచుతూ 03.11.2025న OA 143 & 144 పై NGT ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. అయినా ఈ అక్రమాలు కొనసాగటం స్థానిక అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం…భారత రాజ్యాంగం పౌరులకు జీవన హక్కు మరియు పర్యావరణ రక్షణ హక్కును కల్పిస్తుంది. పేలుళ్ల నియంత్రణ కోసం Explosives Act, IPC వంటి కఠిన చట్టాలు ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలు సూ మోటోగా ఈ విషయం తీసుకొని అక్రమ బ్లాస్టింగ్ తక్షణమే నిలిపివేసి దుర్గానగర్ ప్రజలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని పేర్కొన్నారు.
