సీఎం రేవంత్ అన్న ఎమ్మెల్సీ పదవి ఇస్తా అన్నారు.. ఇస్తారు అన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. తాను ఏ రోజు సచివాలయం కు పోలేదు… మాజీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన వాహనంలోనే సచివాలయానికి వెళ్లాను అన్నారు. సురేఖ గెలిచిన తర్వాత మొదటిసారిగా రాత్రి కొండ సురేఖ చాంబర్ కు వెళ్లి వాస్తు చూసి వచ్చాను… నాకు ఏదైనా పని ఉంటే నేరుగా మంత్రి ఇండ్లలోకే వెళ్తా తప్ప సచివాలయానికి వెళ్ళనని తెలిపారు.
నా బిడ్డ సుస్మిత పార్టీలకు ఎలాంటి పదవులు లేవు … నా మనవరాలు లండన్ లో చదువుతుంది ..మనవడు లండన్ కు వెళ్తాడు అన్నారు. నా అల్లుడు లండన్ లో వ్యాపారం చేస్తున్నాడు …నా బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది అన్నారు. అయితే తాను ఏం మాట్లాడిందో నాకు తెలియదు … నిన్న రాత్రి సుమంత్ ఎపిసోడ్ కోసం నాకు తెలియదు అన్నారు.
నాకు ఫోన్ కూడా సరిగ్గా వాడరాదు… నాకు వరంగల్ మీడియా మిత్రులపై అమితమైన ప్రేమ ఉంది … నాకు ఎల్లవేళలా అండగా ఉన్నారు, ఉదయం నేను లేవ ఒక్క ముందే గేటు బయటmedia ప్రతినిధులు ఉన్నారు … నేనే లేచి వాళ్ళని లోపల వచ్చి మర్యాద చేశా… నాపై గతంలో చాలా కుట్రలు జరిగాయి , అందుకే కొండా సురేఖ వాహనం నేను ఈరోజు ఎక్కలేదు అన్నారు.
మేము వేరువేరుగానే పర్యటిస్తాం.. నన్ను టార్గెట్ చేస్తే ఎదుటివారికే నష్టం…. ఇప్పటికే నేను చాలాసార్లు దెబ్బతిని ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.
