తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బ్లాక్‌మెయిల్‌కు “బ్రాండ్ అంబాసిడర్”గా అభివర్ణిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చిట్‌చాట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆర్టీఐల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక ఆఫీసే పనిచేస్తోందని, దీనికోసం రిటైర్డ్ అధికారులు కూడా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.
సింగరేణి కుంభకోణం అన్న వెంటనే సిట్ విచారణ తెచ్చిన రేవంత్ రెడ్డి, తన పాలనలో సమస్యలు ఎదురైతే ప్రతిసారి సిట్‌ల పేరుతో దృష్టి మళ్లిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, హత్యలపై మాత్రం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కూడా కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ఆత్మగౌరవం పూర్తిగా కేసీఆర్ సొత్తే. కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్నే ముట్టుకున్నట్టే. అస్తిత్వాన్ని ముట్టితే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఏదైనా ఇల్లీగల్ అని చెప్పడానికి పక్కా ఆధారాలు ఉంటే కోర్టులో పెట్టాలి. ట్వీట్లు, లీక్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు. సజ్జనార్ ఏమైనా ఈ మధ్యలో జడ్జ్ అయ్యాడా? అంటూ ఎద్దేవా చేశారు.
అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదని, విచారణ అధికారుల పని దర్యాప్తు చేయడమే తప్ప తీర్పులు చెప్పడం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
