- Advertisement -

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మీ గుండె ఆగిపోతుంది!

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిట్ల పురాణం తప్ప రేవంత్ రెడ్డి ఈ ఏడాది పాలనలో చేసింది ఏమీలేదని విమర్శించారు. మీరు మాట్లాడే భాష మాకూ బాగా వస్తుందన్నారు. కానీ ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇచ్చి మౌనంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. అనవసర శపథాలు చేయడం మానుకుని, ఎన్నికల హామీలు అమలు చేస్తానని శపథం చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారని, గ్రామగ్రామాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మార్పు మొదలైందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ కళ్లుండి చూడలేని ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టగానే కాంగ్రెస్ నేతలకు చలి జ్వరం వస్తోందని ఎద్దేవా చేశారు. అలాంటిది ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ గుండె ఆగిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాను గుంటూరులో చదివితే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను ఆంధ్రాలో చదివినందుకు విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి మాత్రం ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకోవడం తప్పుకాదా అని ప్రశ్నించారు. అమెరికాలో ఎవరి పని వాళ్లు చేసుకుంటారని, తాను కూడా అదే చేశానని తెలిపారు. తాను ఎలాంటి దొంగ పనులు చేయలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని గర్వంగా చెప్పారు. తాను తన తండ్రి పేరు చెప్పుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారని, లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడని రేవంత్‌కు కేటీఆర్ తీవ్ర హెచ్చరిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని, వచ్చే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -