హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గురువారం (ఏప్రిల్ 2) కీలకమైన బిల్లును ఆమోదించింది. పార్టీ మార్పిడి నిరోధక చట్టం (Anti-Defection Law) కింద అనర్హత పొందిన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వకుండా నిరోధించేలా ఈ చట్టం తీసుకువచ్చారు.
సుఖ్‌విందర్ సింగర్ ప్రవేశపెట్టిన “హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుల భత్యాలు మరియు పెన్షన్ (సవరణ) బిల్లు, 2026”ను అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుతో, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హత పొందిన ఎమ్మెల్యేలు ఇకపై పెన్షన్‌కు అర్హులు కారు.
2024లో స్పీకర్ కుల్దీప్ సింగ్ ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి ఎన్నికైన చైతన్య శర్మ, దేవేందర్ భుట్టో పెన్షన్ కోల్పోతుండగా రవి ఠాకూర్, రాజిందర్ రాణా 14వ అసెంబ్లీ కాలానికి పెన్షన్ పొందరు. అయితే తిరిగి ఎన్నికైన సుధీర్ శర్మ,ఇందర్ దత్ లక్షణ్‌పాల్ ఈ చట్టం ప్రభావం నుంచి బయటపడ్డారు
ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు మొదట కాంగ్రెస్‌కు చెందినవారే. కానీ 2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేశారు.అదే విధంగా బడ్జెట్ ఓటింగ్ సమయంలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో, పార్టీ మార్పిడి నిరోధక చట్టం కింద అనర్హత పొందారు.
