- Advertisement -

హరీష్ రావు గుంట నక్క..కవిత ఫైర్!

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం తారస్థాయికి చేరింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ హరీష్ రావు గుంటనక్క అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో కీలక అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్షం సభలో ఉండాల్సిన అవసరం లేదా? అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఒక్క మాట అన్నందుకే సభను బాయ్‌కాట్ చేయడం సరైన పద్ధతేనా? అని నిలదీశారు.

ప్రతిపక్షం అంటే కేవలం ఒక పార్టీ కాదని, అది ప్రజల గొంతుక అని కవిత వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఎన్నిసార్లు విమర్శించినా, హరీష్ రావు ఎప్పుడైనా సభను బాయ్‌కాట్ చేశారా? అంటూ ప్రశ్నించారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చిన రోజే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని తాను చెప్పినట్లు కవిత గుర్తు చేశారు.

అలాగే కృష్ణా జలాల పంపకాల అంశంలోనూ కవిత సూటిగా ప్రశ్నలు సంధించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు తగ్గించే విషయంలో హరీష్ రావు సంతకం పెట్టారా లేదా? అని నిలదీశారు. జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చడానికి అసలు కారణమేంటని ప్రశ్నిస్తూ, ఆ మార్పు వెనుక ప్రజా ప్రయోజనం కాదని, కేవలం హరీష్ రావు ధన దాహమే కారణమని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అంతర్గతంగా కూడా ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -