Friday, May 17, 2024
- Advertisement -

దోమల వంతు అయిపోయింది..మావోల వంతు వచ్చేసింది!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ నేతలు ఇస్తున్న స్టేట్‌మెంట్స్ చూస్తే ప్రజలకు నవ్వురాకమానదు. బాబును జైలు నుండి బయటకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇందుకోసం ఏ చిన్న రీజన్ అయినా దానిని పెద్దగా చూపించి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతీ ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. జైలులో చంద్రబాబును దోమలతో చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు లోకేష్. దీంతో నవ్వుకోని వారుండరూ.

ఇక తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయిన లోకేష్…మరోసారి బాబు భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైలుపై, చంద్రబాబుపై దాడి చేస్తామని కొందరు నక్సలైట్లు లేఖ రాశారని చెప్పారు లోకేష్. అంతేకాదు చంద్రబాబు భద్రతపై ఆందోళన చెందుతున్నామని బెయిల్ కోసం లోకేష్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఇక్కడ లోకేష్ చిన్న లాజిక్ మిస్సయ్యారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో మావోయిస్టుల అణచివేతపై జరిగిన సమావేశంలో జగన్ క్లీయర్ కట్‌గా చెప్పేశారు. ఏపీలో నక్సలిజం ఇష్యూ లేదని…అయితే లోకేష్ మాత్రం తిరిగి మావోల అంశాన్నే ప్రస్తావించడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక టీడీపీ చేస్తున్న ఆందోళనలకు సైతం ప్రజల నుండి అంతగా స్పందన రావడం లేదు. మోత మోగిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ కాగా ఇవాళ ఇచ్చిన కాంతితో క్రాంతి కూడా విఫలం అవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -