- Advertisement -

విమాన ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్..

- Advertisement -

భారతదేశంలో విమాన ప్రయాణికులకు భారీ ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంది విమానయాన శాఖ. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి విమానంలో కనీసం 60% సీట్లను అదనపు చార్జీలు లేకుండా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ నిర్ణయాన్ని DGCA అమలు చేస్తోంది. దీని వల్ల టికెట్ బుకింగ్ సమయంలో ఉన్న ఖర్చులు తగ్గుతాయి.

ప్రభుత్వం “ప్యాసింజర్ ఫస్ట్” విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒకే PNRలో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి కూర్చోబెట్టాలి.సీటింగ్ కోసం అదనపు ఛార్జీలు వేయకూడదు.ప్రయాణికులకు పారదర్శక సమాచారం ఇవ్వాలి

పెంపుడు జంతువుల రవాణాపై స్పష్టమైన నియమాలు ప్రకటించాలి.

స్పోర్ట్స్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ తీసుకెళ్లే విధానాన్ని సులభతరం చేయాలి

బ్యాగేజీ నిబంధనలు స్పష్టంగా తెలియజేయాలి

విమానాల ఆలస్యం, రద్దు, లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా అన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో, ప్రాంతీయ భాషల్లో ప్రదర్శించాలి.

భారత విమాన రంగంలో పారదర్శకత పెంచడం, దాగి ఉన్న ఛార్జీలను తగ్గించడం, సాధారణ ప్రయాణికులకు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశ్యం.

గతంలో విమానాల ఆలస్యాలు, టెక్నికల్ సమస్యలు, పైలట్ కొరత వంటి కారణాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని, ప్రయాణికుల నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -